తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Nalgonda, Telangana Election Results 2023 Live : ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హ‌వా - సూర్యాపేట మాత్రం జగదీశ్​రెడ్డిదే - Suryapet Election Result 2023

Nalgonda, Telangana Election Results 2023 Live : ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ తమ సత్తా చాటింది. ఒక్క సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్​రెడ్డి విజయం సాధించారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ విజయం సాధించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రోజ్ గోపాల్ రెడ్డి విజయం సాధించారు.

Telangana Election Results 2023 Live
Nalgonda

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 3:07 PM IST

Updated : Dec 3, 2023, 7:24 PM IST

Nalgonda, Telangana Election Results 2023 Live : ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎట్టకేలకు కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు బావుట ఎగురవేశారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన కంచర్ల భూపాల్ రెడ్డిపై 54 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక మునుగోడు నియోజకవర్గ విషయానికొస్తే.. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపుతో కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో తమ సత్తా ఏంటో మరిసారి చూపించినట్లు అయింది. ఇరువురి విజయంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) లీడర్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గాంధీభవన్​ వద్ద అంబరాన్నంటిన సంబురాలు

Nalgonda Election Results 2023 Live :హుజూర్‌ నగర్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 44,888 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు జెండా ఎగురవేశారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 54,332 ఓట్లతో విజయం సాధించారు. ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636 ఓట్ల తేడాతో గెలుపొందారు. దేవరకొండలో బాలు నాయక్‌ నేనావత్‌ 30,017 ఓట్లతో విజయం సాధించారు. నాగార్జున సాగర్​లో కుందూరు జయవీర్‌ 55,849 ఓట్లతో, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి 48,782 ఓట్లతో గెలుపొందారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతి 58,679 ఓట్లు ఆధిక్యంతో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.

Telangana Election Results 2023 Live : మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి 40,590 గెలుపు, భువనగిరిలో కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి 26,202 ఓట్ల తేడాతో గెలుపొందారు. నకిరేకల్​లో వేముల వీరేశం 68,839 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తుంగతుర్తిలో మందుల శ్యామ్యూల్‌ 51,094 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఒక్క సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి 4,606 మెజారిటీతో విజయం సాధించారు. 2018లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) గెలవగా, 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 2023 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్​ పార్టీకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఆ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడినట్లు తెలుస్తుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు :

  • నాగార్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి 55,849 ఓట్లతో గెలుపు
  • మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి 48,782 ఓట్లతో గెలుపు
  • నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 54,332 ఓట్లతో గెలుపు
  • హుజూర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 44,888 ఓట్లతో గెలుపు
  • తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్ధి మందుల సామేల్ 51,094 ఓట్ల తేడాతో గెలుపు
  • సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్​ రెడ్డి 4,606 మెజారిటీతో గెలుపు
  • ఆలేరు కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల ఐలయ్య 49,636 ఓట్ల తేడాతో గెలుపు
  • మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 40,590 గెలుపు
  • కోదాడ కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి 58,679 ఓట్లు ఆధిక్యం
  • దేవరకొండ కాంగ్రెస్ అభ్యర్ధి 30,017 ఓట్లతో గెలుపు
  • భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డి 26,202 ఓట్ల తేడాతో గెలుపు
  • నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం 68,839 ఓట్ల తేడాతో గెలుపు

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్

Nizamabad Telangana Election Result 2023 LIVE : ఇందూరులో హోరాహోరీ పోరు - కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాల్లో గెలుపు

Last Updated : Dec 3, 2023, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details