తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నల్గొండలో బస్సు దగ్ధం - ఒకరు సజీవదహనం - 38 మందికి!

Nalgonda Bus Accident Today : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు దగ్ధమయింది. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఒక వ్యక్తి సజీవదహనమయ్యారు.

Bus accident in Nalgonda
Bus fire in Nalgonda Today

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 8:31 AM IST

Updated : Dec 4, 2023, 9:53 AM IST

Nalgonda Bus Accident Today :ప్రమాదం ఏ సమయంలో జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ జరిగినప్పుడు మాత్రం కంటతడి తప్పదు గుండెను పిండే బాధా తప్పదు. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం కూడా అలాంటి విషాదాన్నే మిగిల్చింది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లాకు చేరుకున్న ఓ ప్రైవేట్​ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం : ఓ ప్రైవేట్​ బస్సు హైదరాబాద్​ నుంచి చీరాలకు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో మర్రిగూడ బైపాస్​ రోడ్డు వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు బస్సులో నుంచి పరుగులు తీశారు. అయితే అప్పటికే మంటలు తీవ్రతరం కావడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. ప్రయాణం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ఉన్నట్లు సమాచారం. అయితే మిగిలిన ప్రయాణికుల్లో ఎంత మందికి గాయాలయ్యాయో తెలియాల్సి ఉంది.

వ్యాన్​పై విద్యుత్​ తీగ పడి చెలరేగిన మంటలు - అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన పెనుప్రమాదం

Bus Caught Fire in Nalgonda :ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బస్సులో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలు(Bus Fire at Nalgonda) ఆర్పారు. అయితే అప్పటికే బస్సు చాలా వరకు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఇక సజీవదహనమైన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ పర్యాటక భవన్​లో భారీ అగ్ని ప్రమాదం - అగ్నికి ఆహుతైన కీలక దస్త్రాలు, కావాలనే!

"బస్సులో పొగ వస్తోందని మేమందరం డ్రైవర్​కు చెప్పాం. ఆ విషయం డ్రైవర్​ గమనించి ఏం కాదు అని చెప్పాడు. కాసేపటికే మంటలు వచ్చాయి. బస్సు ఆపివేసి అందరూ బయటకి వెళ్లిపోమని డ్రైవర్​ చెప్పాడు. వెంటనే అందరం మేల్కొని ఉండడంతో బయటకి వచ్చేశాం. మాతో తెచ్చుకున్న వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇప్పటివరకు ట్రావెల్స్​ ఓనర్స్​ స్పందించలేదు. డ్రైవర్​ వేరే బస్సు ఎక్కి వెళ్లమని చెబుతున్నారే తప్ప, ఆ ట్రావెల్​ బస్సు తెప్పించలేదు. ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందు డాబా దగ్గర ఆపారు. అందువల్ల అందరూ మేల్కొని ఉన్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది."- ప్రయాణికుడు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిద్రమత్తులో బస్సు దిగకపోవడం వల్లే వ్యక్తి చనిపోయినట్లు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్(Bus Fire Due to Short circuit) వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

షాపింగ్​ మాల్​లో భారీ అగ్నిప్రమాదం- 11 మంది మృతి

బొగ్గు గని కంపెనీ ఆఫీస్​లో భారీ అగ్నిప్రమాదం- 26మంది మృతి

Last Updated : Dec 4, 2023, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details