తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆస్పత్రిలో నగ్నంగా కొవిడ్ రోగులు- ఎందుకిలా? - naked covid patients lying near toilets

ఒడిశా మయూర్​భంజ్​లోని కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులు ఒంటిపై వస్త్రాలు లేకుండానే నేలమీద పడుకొని ఉన్న వీడియోలు వైరల్​గా మారాయి. మరికొందరు టాయిలెట్ల పక్కనే పడుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి అత్యవసర విచారణకు ఆదేశించారు.

covid-patients-lying-on-floor-in-odisha-hospital-collector-dismisses-allegations-of-negligence
KIMS: టాయిలెట్ల పక్కన నగ్నంగా కొవిడ్ రోగులు

By

Published : Jun 1, 2021, 10:44 AM IST

ఒడిశా మయూర్​భంజ్​లో కరోనా బాధితులు నేలపైనే పడుకొని ఉన్న వీడియోలు బయటపడటం కలకలం సృష్టించింది. వారి ఒంటిపైన వస్త్రాలు కూడా లేకపోవడం విమర్శలకు కారణమైంది. బరిపాడా పట్టణం బంకిశోలా ప్రాంతంలో ఉన్న కిమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. టాయిలెట్ పక్కన, అన్నం ప్లేట్లు పడేసే చోట రోగుల పడకలు ఉండటం వీడియోలో కనిపిస్తోంది.

నేలపై పడి ఉన్న రోగి
టాయిలెట్ల వద్ద కరోనా బాధితులు
నేలపైనే నగ్నంగా రోగులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ బంధువును కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను రికార్డు చేశారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

ఒంటిపై వస్త్రాలు లేకుండా కరోనా రోగి
బెడ్ పక్క నేలపై పడి ఉన్న బాధితుడు

విచారణకు ఆదేశం

ఈ దృశ్యాల గురించి తనకేం తెలియదని మయూర్​భంజ్ అదనపు డివిజనల్ వైద్యాధికారి ఎన్ఆర్ దాస్ చెప్పుకొచ్చారు. అయితే, ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వినీత్ భరద్వాజ్ తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

అంతకుముందు.. ఈ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు కలెక్టర్ వినీత్. రోగులకు చికిత్స జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. వార్డులలోని రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలోని ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి-హైకోర్టు విచారణ యూట్యూబ్​లో లైవ్​- చరిత్రలోనే తొలిసారి!

ABOUT THE AUTHOR

...view details