తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైక్​ను తప్పించబోయి లోయలో పడ్డ పికప్​ వ్యాన్​- 9 మంది మృతి - ఉత్తరాఖండ్ నైనితాల్​ జిల్లా

Nainital Accident News Today : బైక్​ను తప్పించబోయి.. పికప్ వాహనం లోయలో పడ్డ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఉత్తరాఖండ్​లో జరిగిందీ ఘటన. మరోవైపు, గుజరాత్​లో చెట్టును కారు ఢీకొట్టడం వల్ల ఐదుగురు చనిపోయారు.

Nainital Accident News Today
Nainital Accident News Today

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 1:57 PM IST

Updated : Nov 17, 2023, 6:18 PM IST

Nainital Accident News Today : ఉత్తరాఖండ్​లోని నైనితాల్​ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి లోయలోకి దూసుకెళ్లింది ఓ పికప్​ వ్యాన్​. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..పికప్​ వ్యాన్​ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్-రీతా సాహిబ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. వ్యాన్​ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.

నుజ్జునుజుయిన పికప్​ వ్యాన్​

Uttarakhand Accident News : అధికారులు వచ్చేలోపు.. గ్రామస్థులే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రక్షించి రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇంతలో అధికారులు వచ్చి గాయపడ్డవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

సహాయక చర్యల దృశ్యాలు

సీఎం సంతాపం..
మరోవైపు, ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి స్పందించారు. మరణించిన వారి పట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

చెట్టును ఢీకొన్న కారు- ఐదుగురు మృతి
Gujarat Accident News Today : గుజరాత్​లోని గాంధీనగర్​లో మరో ప్రమాదం జరిగింది. చెట్టును కారు ఢీకొట్టడం వల్ల ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

లోయలో పడ్డ టాటా సుమో..
Jammu Kashmir Road Accident : జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లాలో టాటా సుమో అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. థానమండి ప్రాంతంలోని షహ్ద్రా షరీఫ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

అతివేగంతో ట్రక్కును ఢీకొన్న కారు- ఆరుగురు స్నేహితులు దుర్మరణం

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు- 38 మంది మృతి

Last Updated : Nov 17, 2023, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details