తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నర్సింగ్​ సిబ్బందిపై వెంకయ్య, మోదీ ప్రశంసలు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా దేశంలోని నర్సింగ్​ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ. కొవిడ్​ మహమ్మారి విజృంభణలో నర్సులు నిస్వార్థంగా, నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు వెంకయ్య. దేశ ప్రజలంతా వారికి కృతజ్ఞతలు తెలపాలన్నారు.

Venkaiah, Modi
వెంకయ్య, మోదీ

By

Published : May 12, 2021, 2:13 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో నర్సులు నిస్వార్థంగా, నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారత ఆరోగ్య వ్యవస్థలో నర్సులు కీలకమైన వారిగా అభివర్ణించారు.

"అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. ప్రజలకు నిస్వార్థంగా, నిరంతరాయంగా సేవలందిస్తున్న మన నర్సులను అభినందిస్తున్నా. ఈ మహమ్మారి సమయంలో ముందుండి పోరాడుతున్నారు. ఆరోగ్య వ్యవస్థలో కీలక లింక్​గా ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం వారు చేసిన అమూల్యమైన కృషికి మనమందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం. "

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

సామాజిక సంస్కర్త, ఆధునిక నర్సింగ్​ వ్యవస్థాపకులు ప్లోరెన్స్​ నైటింగెల్​ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

కొవిడ్​ పోరులో ముందు వరుసలో నర్సులు: మోదీ

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా దేశంలోని నర్సులపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆరోగ్యకరమైన భారత్​ పట్ల వారి విధి, నిబద్ధత ఆదర్శప్రాయమన్నారు.

"కష్టపడి పనిచేసే నర్సింగ్​ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేదే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. కొవిడ్​-19 కట్టడిలో ముందుండి పోరాడుతున్నారు. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి:కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​!

ABOUT THE AUTHOR

...view details