తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబంలో ఐదుగుర్ని చంపి తానూ ఆత్మహత్య..

కుటుంబంలో ఐదుగుర్ని హత్య చేసిన అనంతరం తానూ అత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో జరిగింది.

man killed five family members
సొంత కుటంబీకులని చంపిన వ్యక్తి

By

Published : Jun 21, 2021, 10:58 PM IST

కుటుంబంలో ఐదుగుర్ని చంపి తానూ ఆత్మహత్య..

మహారాష్ట్రలోని నాగ్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది. ఓ 45 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంలో ఐదుగుర్ని చంపి.. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని పచ్పోలి ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.

అశోక్​ మాటుకర్ అర్ధరాత్రి సమయంలో​ తన భార్య విజయ(40), కూతురు పారి (14), కుమారుడు సాహిల్​ (12)లను ఇంట్లోనే గొంతు కోసి చంపాడు. అనంతరం 200 మీటర్ల దూరంలో ఉన్న తన అత్తమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను, మరదలు అమిషా బోబ్డే(21)ను కూడా గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత సీలింగ్​ ఫ్యాన్​కు ఉరివేసుకుని తానూ ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా అడిషనల్​ కమిషనర్ ఆఫ్​ పోలీస్ సునీల్​ ఫౌలారి వెల్లడించాడు.

డోర్ తెరవకపోయేసరికి..

ఉదయం 9 గంటలు అయినా.. మాటుకర్​ ఇంటి డోర్​ తెరవకపోయేసరికి ఇరుగుపొరుగువారు అనుమానపడ్డారు. అనంతరం కిటికీ నుంచి తొంగి చూశారు. దీంతో అసలు విషయం బయటపడింది. సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం​ పంపించినట్లు పోలీసులు తెలిపారు.

మాటుకర్ దర్జీ పని చేసేవాడు. ఇంట్లో గొడవ కారణంగానే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:డబుల్ డెక్కర్​ బస్సు బోల్తా- 36 మందికి తీవ్రగాయాలు

రైలు నుంచి జారిపడ్డ మహిళ- క్షణాల్లోనే...

ABOUT THE AUTHOR

...view details