తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో యథాతథ స్థితి కొనసాగింపునకు ఇరు రాష్ట్రాల అంగీకారం'

Nagarjuna Sagar Water Dispute Issue : నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Nagarjuna Sagar Water Dispute
Nagarjuna Sagar

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:31 PM IST

Nagarjuna Sagar Water Dispute Issue :నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల విషయంలో నవంబర్ 28వ తేదీకి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ సీఆర్పీఎఫ్ దళాల పర్యవేక్షణకు అప్పగించాలన్న కేంద్ర హోం శాఖ కార్యదర్శి ప్రతిపాదనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అంగీకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సాగర్​ నుంచి నవంబర్ 29న ఏపీ ప్రభుత్వం నీటి విడుదల సందర్భంగా తలెత్తిన వివాదంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.

Nagarjuna Sagar Dam Water Clash :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిర్వహించిన ఈ సమీక్షలో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్​తో పాటు నీటి పారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అదనపు డీజీ ఎస్కే జైన్, ఐజీ షానవాజ్ కాశీం, నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్​పాండే హాజరయ్యారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో- ఎన్నికల్లో లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు : రేవంత్‌

నవంబర్ 29 రాత్రి ఏపీకి చెందిన దాదాపు 500 మంది సాయుధ పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్​పైకి వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు 5, 7 గేట్ల వద్ద ఉన్న హెడ్ రెగ్యులేటర్లను తెరిచి దాదాపు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణలో ఉండగా, ఏపీ ప్రభుత్వం చేసిన చర్య రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధమైన అతిక్రమణకు పాల్పడటం ఇది రెండోసారని సీఎస్ చెప్పారు.

Nagarjuna Sagar Dam Water Issues :ఏపీ ప్రభుత్వం చర్యతో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల రెండు కోట్ల ప్రజల తాగు నీటి అవసరాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని శాంతి కుమారి ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి కొనసాగుతున్న తరహాలోనే యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ డ్యామ్​పై గతంలో ఉన్న మాదిరి యథాతథ స్థితి కొనసాగించాలని, డ్యామ్​ను తాత్కాలికంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాల పర్యవేక్షణలో ఉంటుందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.

సాగర్ వార్ - ఇరు రాష్ట్రాల ఖాకీల పహారాతో టెన్షన్ టెన్షన్ - ఏపీ పోలీసులపై కేసు నమోదు

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ABOUT THE AUTHOR

...view details