Nagarjuna Sagar Dam Controversy :నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై గత కొంత కాలంగా సరైన స్పష్టత లేదు. కానీ నాగార్జున సాగర్ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ భద్రత (Nagarjuna Sagar Security), కార్యకలాపాలను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. సాగర్ వద్ద సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.
Nagarjuna Sagar Security and Operations to KRMB :తెలంగాణ ఎన్నికల సమయంలో సాగర్ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. సాగర్ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు, సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏయే అవుట్‌లెట్స్ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈవోలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ సూచించింది. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది.
ఉద్రిక్త పరిస్థితికి ముగింపు - నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు
Telugu States Sagar Dam Issue :శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది.