Nagaland firing incident: నాగాలాండ్‌లో కాల్పుల ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసింది ఆర్మీ. ఈ మేరకు కాల్పులు జరిగిన మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో పర్యటించింది ప్రత్యేక దర్యాప్తు బృందం.
కాల్పుల సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారించినట్లు ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం.. మోన్ జిల్లాలోని టిజిట్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి.. వివరాలు తెలుసుకున్నామని వివరించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి సీనియర్ ర్యాంక్ అధికారి జనరల్ మనోజ్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే.. తమకు షేర్ చేయాలని ఇప్పటికే రెండుసార్లు పబ్లిక్ నోటీస్ ద్వారా ప్రజలను కోరినట్లు ఆర్మీబృందం తెలిపింది. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది.
Nagaland Army killings: నాగాలాండ్‌లో మిలిటెంట్లుగా భావించి డిసెంబర్ 4న పౌరులపై కాల్పులు జరిపాయి భద్రతా బలగాలు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. మరో 11 మంది పౌరులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ జవాను సైతం ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.