తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విశ్వభారతి' ఆహ్వానంపై దీదీ-నడ్డా మధ్య రగడ

విశ్వభారతి విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి తృణమూల్​, భాజపా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తనను వేడుకలకు ఆహ్వానించలేదని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ అంటుంటే, ఆమే బహిష్కరించారని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.

By

Published : Dec 25, 2020, 6:09 AM IST

Nadda attacks Mamata for 'boycotting' Visva-Bharati event, she says was never invited
'విశ్వభారతి' ఆహ్వానంపై దీదీ-నడ్డా మధ్య రగడ

బంగాల్​ విశ్వభారతి విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆహ్వానించకపోవడం పట్ల తృణమూల్​ కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది. బుధవారం రాత్రి ఆహ్వానం పంపామంటున్న భాజపా ప్రకటనను తప్పుపట్టిన తృణమూల్.. గంటల సమయం ముందు ఆహ్వానం పంపడం గౌరవమేనా అని ప్రశ్నించింది. మమత ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలని సూచించింది.

మమతా బెనర్జీ కూడా ఆహ్వానంపై వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'రవీంద్రనాథ్​ ఠాగూర్ సిద్ధాంతాలను కాపాడుకోవాలి'

భాజపా మరో మాట..

వర్సిటీ శతాబ్ధి వేడుకలను మమతనే బహిష్కరించారని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజకీయ శత్రుత్వం, అహంకారం కారణంగా.. ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేదని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, రవీంద్రనాథ్​ ఠాగూర్​ ప్రతిష్ఠను.. దీదీ దిగజారుస్తున్నారని విమర్శించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలు మోదీపై విశ్వాసం ఉంచి భాజపాను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు నడ్డా.

ఇవీ చూడండి: 'ఠాగూర్ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్'

'మిషన్​ 200' కోసం అమిత్ షా కొత్త స్కెచ్​

ABOUT THE AUTHOR

...view details