NABARD Jobs 2023 : ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్సైట్ https://www.nabard.org/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
NABARD Assistant Manager Jobs : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ - A (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్) - 150 పోస్టులు
- యూఆర్ - 61 పోస్టులు
- ఎస్సీ - 22 పోస్టులు
- ఎస్టీ - 12 పోస్టులు
- ఓబీసీ - 41 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 14 పోస్టులు
విభాగాలు
NABARD Departments : జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యునికేషన్/ మీడియా స్పెషలిస్ట్ ( NABARD Assistant Manager Recruitment 2023)
విద్యార్హతలు
NABARD Assistant Manager Qualifications : ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, ఎఫ్సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ .. కోర్సుల్లో క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
NABARD Assistant Manager Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 1 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.