ఆల్ ఇండియా నేషనల్ రీజినల్ కాంగ్రెస్ పార్టీ(ఏఐఎన్ఆర్సీ) అధినేత ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టడం ఆయనకు ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. సరైన పాలన అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. ఎఐఎన్ఆర్సీ, భాజపా కలిసి ఎన్డీఏగా బరిలోకి దిగి 16 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వాటిలో రంగస్వామి పార్టీ 10 సీట్లు, కమలం పార్టీ 6 సీట్లు గెలుపొందాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను అందుకున్నాయి. అధికార కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితం కాగా, డీఎంకే 6 స్థానాల్లో గెలిచింది.
నాలుగోసారి..