తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16ఏళ్ల కూతురుకు బలవంతపు పెళ్లి- తల్లికి షాక్! - హసన్

నిండా 18 ఏళ్లు కూడా లేని బాలికను పెళ్లి చేసుకోమని తల్లే బలవంతం పెడుతోంది. తల్లి పోరు పడలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక.. అధికారులను ఆశ్రయించింది. అప్పుడు ఏం జరిగిందంటే?

child marriage
బాల్య వివాహం

By

Published : Aug 19, 2021, 8:12 PM IST

బలవంతపు పెళ్లి నుంచి విముక్తి కలిగించాలని శిశు సంరక్షణ అధికారికి విజ్ఞప్తి చేసింది ఓ 16 ఏళ్ల బాలిక. తనకు చదువుకోవాలని ఉందని, వీలైతే తనను చదవించాలని కోరుతూ లేఖ రాసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

హసన్​కు చెందిన బాలిక తండ్రి మరణించారు. అప్పటి నుంచి ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నిస్తోంది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి స్నేహితురాలి నివాసంలో ఆశ్రయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అధికారులకు లేఖ రాసి తనకు సహాయం చేయాల్సిందిగా కోరింది.

బాలిక రాసిన లేఖ

బాలిక ప్రస్తుతం పదో తరగతి పాసైంది. ఆమెను బాలమందిర్​కు పంపాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details