తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mysuru gang rape case: ఐదుగురు నిందితులు అరెస్ట్​

మైసూరులో కళాశాల విద్యార్థిని గ్యాంగ్​ రేప్​(Mysuru gang rape) చేసిన వారిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కర్ణాటక డీజీ తెలిపారు. నిందితుల్లో ఒకరు మైనర్​ అని అనుమానిస్తున్నారు.

Mysuru gang rape case
మైసూరు గ్యాంగ్​ రేప్​ కేసు

By

Published : Aug 28, 2021, 1:46 PM IST

Updated : Aug 28, 2021, 2:42 PM IST

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూరు గ్యాంగ్ రేప్​ కేసు(Mysuru gang rape case)లో పురోగతి లభించింది. కర్ణాటక పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితులంతా తమిళనాడుకు చెందిన వారిగా తెలిపారు కర్ణాటక డీజీ & ఐజీపీ. అందులో ఒకరు జువైనల్​గా భావిస్తున్నట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది పథకం ప్రకారమే జరిగిందని చెప్పలేమని అన్నారు. నిందితులు రూ.3 లక్షలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వకపోవడం వల్ల.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వివరించారు.

బాధితురాలితో పాటు ఆమె స్నేహితుడు స్పృహలోకి రానందున.. వారి నుంచి వివరాలేవీ సేకరించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను బట్టి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న బృందానికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించినట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే..

మైసూర్​లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన విద్యార్థిని ఇటీవల తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి చాముండి హిల్స్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడి నుంచి బైక్​పై తిరిగి వస్తుండగా.. కొందరు యువకులు వారిని అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వారి వద్ద పెద్దగా నగదు లేకపోవడం వల్ల.. దుండగులు దాడి చేశారు. యువతి బాయ్​ఫ్రెండ్​ను చితకబాదారు. లలితాద్రిపుర రహదారి వద్ద యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిసింది.

ఇదీ చదవండి:బాలికపై సామూహిక అత్యాచారం- 10గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

Last Updated : Aug 28, 2021, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details