తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో కొత్త వ్యాధి- పిట్టల్లా రాలుతున్న శునకాలు! - కేరళ వార్తలు

అంతుచిక్కని వ్యాధితో(dogs disease) కేరళ, కోవలంలో వీధి శునకాలు మృతి(dog died suddenly) చెందటం ఆ ప్రాంతం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రెండు వారాల్లోనే 20 శునకాలు మృతి చెందాయి. ఇంకా చాలా కుక్కలకు ఈ వ్యాధి సోకి ఉంటుందని అధికారులు తెలిపారు.

By

Published : Nov 11, 2021, 1:03 PM IST

కేరళలోని ప్రముఖ పర్యటక ప్రదేశాల్లో ఒకటి కోవలం. ప్రస్తుతం అక్కడికి వెళ్లేందుకు పర్యటకులు భయపడుతున్నారు. దానికి కారణం.. ఆ ప్రాంతంలో అంతు చిక్కని వ్యాధి(dogs disease) వ్యాపించి వీధి శునకాలు మరణించటమే(dog died suddenly). గడిచిన రెండు వారాల్లోనే 20 కుక్కలు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది.

శునకాల మృతికి(dog died suddenly) గల కారణాలను తెలుసుకోలేకపోతున్నారు పశుసంవర్ధక శాఖ వైద్యులు. అయితే.. వణుకు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఇంకా చాలా కుక్కలు నీరసంగా కనిపించాయని, అవి కూడా వ్యాధి బారినపడినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన శునకాలు రెండు రోజుల్లోనే మరణిస్తున్నాయన్నారు.

కనైన్​ డిస్టెంపర్​ వైరస్​..

ఈ మరణాలకు గాలి ద్వారా వ్యాపించే వైరస్​ ఇన్​ఫెక్షన్​ కారణంగా అనుమానిస్తున్నామని, కనైన్​ డిస్టెంపర్ వైరస్​​ కావచ్చని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు మనుషులకు వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.

ఈ వ్యాధికి అత్యంత ఖరీదైన వ్యాక్సిన్​తోనే అడ్డుకట్ట వేయగలమని భావిస్తున్నారు వైద్యులు. అయితే, అలాంటి టీకా ప్రణాళికల నుంచి వీధి శునకాలను తొలగించారని తెలిపారు. ఈ వైరస్​ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నక్కలు, తోడేళ్లలో ఈ కనైన్​ డిస్టెంపర్​ వైరస్​ వ్యాప్తి సాధారణంగా కనిపిస్తుందని తెలిపారు.

కోవలంలో సుమారు 200 వీధి శునకాలు ఉన్నట్లు అంచనా. వైరస్​తో కుక్కలు చనిపోవటంపై ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి:కరోనాకన్నా నిపా ప్రమాదకరమా? మహమ్మారిగా మారుతుందా?

ABOUT THE AUTHOR

...view details