తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mysore Dasara: మైసూర్​ ప్యాలెస్​లో దసరా సందడి.. - దసరా వేడుకలు

కర్ణాటకలోని మైసూర్​ ప్యాలెస్​లో దసరా ఉత్సవాలు (Mysore Dasara) ఘనంగా సాగుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా మాహారాజ యదువీర్ కృష్ణదత్త​ శమీ వృక్షానికి పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం జంబూ సవారీ జరగనుంది.

Vijayadashami in mysore
మైసూర్​ ప్యాలెస్​లో ఘనంగా 'ఆయుధ పూజ'

By

Published : Oct 15, 2021, 1:31 PM IST

Updated : Oct 15, 2021, 4:53 PM IST

కర్ణాటక రాష్ట్ర పండుగ అయిన దసరా ఉత్సవాలు(Mysore Dasara) ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పటిలానే వడయార్​ వంశానికి చెందినవారి చేతులు మీదుగా ఉత్సవం ప్రారంభమైంది. వడయార్ వారసుడు యదువీర్​ కృష్ణదత్త చామరాజ వడయార్ చేత అర్చకులు మైసూరు కోటలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం శమీ వృక్షాన్ని ఆరాధించారు.

మైసూర్​ మహారాజా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్​
శమీ వృక్షాన్ని పూజిస్తున్న యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్​

గజరాజుల అలంకరణ

ఉత్సవాల్లో భాగంగా.. రాజవంశస్థుల ఆధ్వర్యంలో సాయంత్రం జంబూ సవారీ(Mysore Dasara) నిర్వహించనున్నారు. ఇందుకు ఏనుగులు అందంగా అలంకరించారు. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, అందులో చాముండి దేవి విగ్రహాన్ని ఊరేగిస్తారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతో పాటు మొత్తం ఆరు గజరాజులు.. ఈ వేడుకలో పాల్గొంటాయి.

జంబూ సవారీకి సిద్ధం చేసిన గజరాజులు

ఈసారి తక్కువ మందితోనే..

జానపద నృత్యాలు, దివిటీల విన్యాసాలతో మైసూరు వీధుల్లో సందడిగా జరగాల్సిన దసరా(Mysore Dasara).. గతేడాదిలా ఈసారి కూడా నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో.. సాంస్కృతిక కార్యక్రమాలకు 500 మందికి మించకుండా అనుమతించారు.

దసరా శోభతో మైసూర్​ ప్యాలెస్​

400 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం

వడయార్ వంశస్థులు మొదటగా శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సందర్భంగా దసరా వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ.. వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పర్యటకులు తరలివస్తారు.

ఇదీ చూడండి:ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి

Last Updated : Oct 15, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details