ప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ 'మై గవర్నమెంట్'పై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజా భాగస్వామ్య పాలనకు సరైన ఉదాహరణగా, యువతకు ప్రశ్నించే గొంతుకను ఇవ్వటంలో శిఖరాగ్రాన నిలిచిందని కొనియాడారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తూ సూచనలు చేసిన వలంటీర్లు, కంట్రిబ్యూటర్లను ప్రశంసించారు మోదీ.
మై గవర్నమెంట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. 2014లో ఎన్డీఏ సర్కారు తొలిసారి అధికారంలోకి వచ్చాక ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది మైగవర్నమెంట్ ఇండియా పోర్టల్. 'ఏడేళ్ల ప్రయాణాన్ని అత్యంత విలువైనదిగా మార్చిన మైగ వర్నమెంట్ సభ్యులకు కృతజ్ఞతలు. మైగవ్.ఇన్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీ విలువైన సూచనలు అందించినందుకూ కృతజ్ఞతలు' అని పేర్కొంది.
జులై 29 జాతినుద్దేశించిన మోదీ ప్రసంగం