సీతల్‌కుచి కాల్పుల ఘటనకు సంబంధించి భాజపా విడుదల చేసిన ఆడియో క్లిప్.. వివాదాస్పదంగా మారింది. బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వరంతో ఉన్న ఆడియో క్లిప్‌ను పరిశీలించాల్సిందిగా స్వాపన్ దాస్ గుప్త నేతృత్వంలోని భాజపా ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కోరింది. మమత వ్యాఖ్యలు పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉద్రిక్తతను ప్రేరేపించేలా ఉన్నాయని బంగాల్ ఎన్నికల ప్రధాన అధికారి అప్తాబ్‌కు భాజపా నేతలు వివరించారు. కూచ్‌బిహార్ కాల్పుల్లో చనిపోయిన బాధితుల మృతదేహాలతో ర్యాలీ చేపట్టాలని సీతల్‌కుచి అభ్యర్థితో మమత మాట్లాడినట్లు ఆడియోలో ఉంది.
'ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు'
అయితే ఈ ఆడియో క్లిప్‌ను భాజపా తయారు చేసిన బూటకపు క్లిప్‌గా టీఎంసీ కొట్టిపారేసింది. ముఖ్యమంత్రి ఫోన్‌ను సైతం భాజపా ట్యాప్ చేస్తోందని ఆరోపించారు మమతా బెనర్జీ. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు. ఈ ఘటనలో భాగమైన ఎవ్వరినీ వదిలిపెట్టనన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్‌తో భాజపా సమానం కాదన్నారు.
కూచ్‌బిహార్ కాల్పులపై రిపోర్టుకు ఈసీ ఆదేశం