తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది.. ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్'

Naveen Jindal News: తన కుటుంబం ప్రమాదంలో ఉందని భాజపా బహిష్కృత నేత నవీన్​ జిందాల్ అన్నారు. తన ఫ్యామిలీపై ఇస్లామిక్ చాంధసవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ శనివారం ట్వీట్ చేశారు. మరోవైపు, మహారాష్ట్రలోని భీవండి పోలీసులు.. నవీన్​ జిందాల్​, నుపుర్​శర్మకు సమన్లు జారీ చేశారు. వాంగ్మూలం నమోదు చేయడానికి హాజరు కావాల్సిందిగా సూచించారు.

Naveen Jindal News
Naveen Jindal News

By

Published : Jun 12, 2022, 2:24 PM IST

Naveen Jindal Tweet: మహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకుగానూ భాజపా నుంచి బహిష్కరణకు గురైన పార్టీ మాజీ అధికార ప్రతినిధి నవీన్‌ జిందాల్ శనివారం అర్ధరాత్రి ట్విటర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ వివరాలను ఎవరూ బహిర్గతం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. "నా గురించి, నా కుటుంబం గురించి దయచేసి ఎవరూ ఎటువంటి వివరాలు ఎవరికీ చెప్పొద్దు. నేను అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. చాలా మంది నా నివాసానికి సంబంధించిన చిరునామాను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇస్లామిక్‌ ఫండమెండలిస్ట్‌ల నుంచి నా కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది" అని జిందాల్‌ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. పలువురి నుంచి తనకు బెదిరింపులు వచ్చినట్లు చెబుతూ కొన్ని స్క్రీన్‌షాట్లను జిందాల్‌ ట్విట్టర్​లో పంచుకున్నారు.

పలు చోట్ల హింసాత్మకం.. మహమ్మద్‌ ప్రవక్తపై వ్యాఖ్యలకు గాను భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ను అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పలుచోట్ల హింసాత్మకంగా మారాయి. ఆ ఘటనల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో శనివారం కూడా కనిపించింది. హావ్‌డాలోని పాంచలా బజార్‌లో నిరసనకారులు పోలీసులతో ముఖాముఖి తలపడ్డారు. దిల్లీలోని జామా మసీదు వద్ద అనుమతిలేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు శనివారం పలువురిపై కేసు నమోదు చేశారు. పలు హింసాత్మక ఘటనలు జరిగిన రాంచీ నగరంలో శనివారం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సమన్లు జారీ చేసిన భీవండి పోలీసులు.. నుపుర్​ శర్మ, నవీన్​ జిందాల్​కు మహారాష్ట్రలోని భీవండి పోలీసులు ఆదివారం సమన్లు జారీ చేశారు. జూన్​ 15న వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా నవీన్​ జిందాల్​ను కోరినట్లు సీనియర్​ పోలీస్​ఇన్​స్పెక్టర్​ చేతన్​ తెలిపారు. మే 30న రజా అకాడమీ ప్రతినిధి చేసిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. అంతకుముందు ముంబ్రా పోలీసులు.. వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి జూన్ 22న తమ ముందు హాజరు కావాలని నుపుర్​శర్మను కోరారు. దీంతో పాటు ముంబయి పోలీసులు జూన్ 25న హాజరుకావాలని ఆమెకు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details