ఐదేళ్ల కుమారుడికి ద్విచక్ర వాహనం డ్రైవింగ్‌ను అప్పగించాడు ఓ తండ్రి. ఆ తండ్రి డ్రైవింగ్ లైసెన్స్‌ను మోటార్‌వాహన విభాగం అధికారులు రద్దు చేశారు. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగింది. వారి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఐదేళ్ల చిన్నారికి బైక్ డ్రైవింగ్ - తండ్రి లైసెన్స్ రద్దు - మైనర్‌తో డ్రైవింగ్
ఐదేళ్ల కుమారునికి ద్విచక్రవాహనం డ్రైవింగ్ అప్పగించి చిక్కుల్లో పడ్డాడో తండ్రి. గమనించిన అధికారులు తండ్రి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. ఈ సంఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది.
![ఐదేళ్ల చిన్నారికి బైక్ డ్రైవింగ్ - తండ్రి లైసెన్స్ రద్దు MVD suspends man's license for letting his little son control motorbike](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10100574-570-10100574-1609651689061.jpg)
మైనర్కి బైకిచ్చాడు- లైసెన్స్ రద్దయింది
ఐదేళ్ల కుమారునితో బైక్ డ్రైవింగ్ చేయిస్తోన్న తండ్రి
డిసెంబర్31న అబ్దుల్ మాజీద్ అనే వ్యక్తి తన కుమారుడితో ద్విచక్ర వాహనం మీద తెలక్కడ్ వెళుతున్నాడు. ఈ క్రమంలో అతను వెనక కూర్చొని కుమారునితో డ్రైవింగ్ చేయించాడు. రహదారిపై వెళుతున్న మోటర్ వాహన విభాగం అధికారులు గమనించి మాజీద్‌ను ఆపి, అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. బినయ్ వర్గేశ్ అనే అధికారి దీనికి సంబంధించిన వీడియో రికార్డు చేశారు. వీడియో ప్రకారం అబ్దుల్ తన కుమారునితో డ్రైవింగ్ చేయించాడని అధికారులు తేల్చారు.
ఇదీ చూడండి:2 కార్లు ఢీ.. ఏడుగురు చిన్నారులు సజీవదహనం
TAGGED:
మైనర్‌తో డ్రైవింగ్