Muzaffarpur eye lost case update: బిహార్ ముజఫర్‌పుర్‌లో కేటరాక్ట్ సర్జరీలు విఫలమైన ఘటనలో 15 మందికి కంటిచూపు పోయింది. వీరి కళ్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. మరికొంతమంది బాధితులు ఎస్కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
Muzaffarpur cataract surgery fail:
అన్ని ఆపరేషన్లను ఆస్పత్రి వైద్యుడు ఎన్డీ సాహూ నిర్వహించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో ఈ విషయాన్ని ఒప్పుకున్నారని సమాచారం. ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత నలుగురికి సమస్యలు తలెత్తగా.. వారి కళ్లను తొలగించారు. ఈ విషయాన్ని తొలుత ఆస్పత్రి దాచి ఉంచిందని తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి డీఎం, సివిల్ సర్జన్‌కు సైతం సమాచారం అందించలేదు.
Muzaffarpur hospital operation theatre sealed
ఈ విషయంపై మాట్లాడిన సివిల్ సర్జన్ డాక్టర్ వినయ్ శర్మ.. ఘటనపై పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. బాధితులందరి సమాచారాన్ని ఆస్పత్రి తమకు అందించలేదని చెప్పారు. కంటి ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌కు దర్యాప్తు టీమ్ సీల్ వేసిందని తెలిపారు.
"ఎస్కేఎంసీఎచ్లో బాధితుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం. ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ నుంచి సేకరించిన నమూనాలను ఎస్కేఎంసీఎచ్లో పరీక్షిస్తున్నాం. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది."