Mutton or Me: సంసారంలో భార్యాభర్తలకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు మీరు చదవబోయేది అలాంటి చిత్రమైన స్టోరీనే. ఇక్కడ భోజనం విషయంలో భేదాభిప్రాయం.. వారి సంబంధం దెబ్బతినే పరిస్థితికి దారితీసింది.
ఆ దంపతులు ఇద్దరు శాకాహారులు. తన భార్య మాంసాహారం తింటుందని ఆ భర్తకు తెలుసు. కానీ పెళ్లి తర్వాత తిననని ఒట్టు వేయించుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత ఆమె తనకు తెలియకుండా మటన్ తింటుందని తెలుసుకున్నాడు. అక్కడ మొదలైంది గొడవ. నేను కావాలా? మటన్ కావాలా? తేల్చుకో అంటూ అల్టిమేటం విధించాడు.
అయితే ఇప్పుడా భర్తకు వేరే భయం పట్టుకుంది. తన భార్య ఒకవేళ మటన్ మానక, తనను వదులుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటని వాపోతున్నాడు.
ఈ సమస్యను పరిష్కరించుకోలేక, నిపుణుల నుంచి సలహా కోసం ఓ పత్రికకు రాశాడు.
ఓ యూజర్ ఆ పేపర్ కటింగ్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ప్రశ్న, జవాబు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రశ్న:
''ఆమె చాలా అందంగా ఉంటుంది. తను ఇక ఎప్పుడూ ఎక్కడ మటన్ తినననే షరతుతో పెళ్లికి ఒప్పుకున్నా. కానీ ఇప్పుడు తను మటన్ అంటే ఇష్టం. అది లేకుండా ఉండలేను అంటోంది. నేను ఒకసారి తనను క్షమించా. ఇప్పుడు మాత్రం అలా చేయలేను. మటన్ కావాలా? ప్రేమ కావాలా? అని అల్టిమేటం విధించా.
కానీ ఇప్పుడు భయమేస్తోంది. తను మటన్‌నే ఎంచుకుంటే నా పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు?''