తెలంగాణ

telangana

ETV Bharat / bharat

11 ఏళ్ల బాలుడ్ని బలిగొన్న మూఢనమ్మకం! - akbarpur police station

రాజస్థాన్​లో దారుణం జరిగింది. విచ్ఛిన్నమైన 11ఏళ్ల చిన్నారి మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. క్షుద్ర పూజ కోసమే తమ బిడ్డను ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Mutilated body of child found in Alwar, family alleges superstition
11ఏళ్ల బాలుడిని బలిగొన్న మూఢనమ్మకం!

By

Published : Dec 28, 2020, 4:14 PM IST

రాజస్థాన్​ అల్వార్​ జిల్లాలో ముక్కలుగా చేసిన 11ఏళ్ల బాలుడి మృతదేహం కలకలం రేపింది. క్షుద్ర పూజ కోసం తమ కుమారుడిని హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల నుంచి తన కుమారుడు నిర్మల్​ కనిపించడంలేదని అల్వార్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు తల్లీదండ్రులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. పంట పోలంలో శరీరం నుంచి ముక్కు, చెవులు, వేళ్లు వేరు చేసిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. నిర్మల్​ శరీరాన్ని కత్తితో కోసిన ఆనవాళ్లు ఉన్నాయన్నాయని పోలీసులు తెలిపారు.

బంధువుల పనే!

"నా కుమారుడు రెండు క్రితం అదృశ్యమయ్యాడు. అన్ని ప్రదేశాల్లో వెతికాం. ఎక్కడా నిర్మల్​ జాడ కనిపించలేదు. మూఢ విశ్వాసాల కోసం మా బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టారు" అని బాలుడి తండ్రి.. ఈటీవీ భారత్​కు చెప్పుకొచ్చారు.

ఈ కేసుపై ముమ్మర విచారణ చేపడుతున్నట్లు ఆ జిల్లా ఎస్​పీ తేజస్వీ గౌతం తెలిపారు.

ఇదీ చూడండి:అసోంలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details