తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మ్యుటేషన్‌.. ఆస్తిపై హక్కును సృష్టించలేదు: సుప్రీం - రెవెన్యూ రికార్డ్స్ మ్యుటేషన్స్

రెవెన్యూ రికార్డుల్లో ఉండే మ్యుటేషన్ ఎంట్రీ..(Property Mutation) ఆస్తిపై వ్యక్తి యాజమాన్య హక్కును నిర్ధరించలేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. యాజమాన్యపు హక్కు మార్పిడి అయ్యిందనేందుకు మాత్రమే ఈ నమోదు ప్రక్రియ జరుగుతుందని తెలిపింది.

mutation entry supreme court
మ్యుటేషన్ ఎంట్రీ సుప్రీంకోర్టు

By

Published : Sep 12, 2021, 6:35 AM IST

Updated : Sep 12, 2021, 9:10 AM IST

ఆస్తిపై వ్యక్తి యాజమాన్య హక్కును రెవెన్యూ రికార్డుల్లో ఉండే 'మ్యుటేషన్‌ ఎంట్రీ' (Mutation of Property) నిర్ధరించలేదని, శాశ్వతమైన హక్కునూ అది సృష్టించలేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. సంబంధిత ఆస్తి 'యాజమాన్యపు హక్కు మార్పిడి' అయ్యిందనడానికి మాత్రమే స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్లు/మండల రెవెన్యూ కార్యాలయాల్లోని పత్రాల్లో నమోదు ప్రక్రియ (Property Tax Mutation) జరుగుతుందని పేర్కొంది. చట్టబద్ధమైన హక్కును అది తొలగించలేదంది.

రెవెన్యూ రికార్డుల జమాబందీ ప్రక్రియ.. పన్ను వసూళ్లకే ఉపయోగపడుతుందని పేర్కొంటూ జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం ఓ కేసులో తీర్పును వెలువరించింది. ఆస్తి హక్కు వివాదాలపైనా, వీలునామా ఆధారంగా మ్యుటేషన్‌ చేయడంపైనా సంబంధిత వ్యక్తులు సివిల్‌ కోర్టుకు వెళ్లడమే సముచితమని పేర్కొంది.

ఇదీ చదవండి:పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట పడాలంటే..

Last Updated : Sep 12, 2021, 9:10 AM IST

ABOUT THE AUTHOR

...view details