రాజస్థాన్ అల్వర్ జిల్లా పరిపాలన యంత్రాంగం స్థానికంగా ఉండే 'సింఘానియా' ఆయిల్ మిల్లును సీజ్ చేసింది. ఇందులో భారీగా కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారుల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి ఆవ నూనె సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
'భారీగా పతంజలి కల్తీ నూనె- ఫ్యాక్టరీ సీజ్' - బాబా రాందేవ్ ఆయిల్ మిల్లును సీజ్
రాజస్థాన్లోని ఓ ఆయిల్ మిల్లును అక్కడి జిల్లా యంత్రాంగం సీజ్ చేసింది. ఫ్యాక్టరీలో కల్తీ నూనెను ఉత్పత్తి చేస్తున్నారు ఆనే ఆరోపణలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో భారీగా పతంజలి పేరిట ఉన్న కల్తీ నూనె సీసాలను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బాబా రాందేవ్, కల్తీ నూనె
తదుపరి దర్యాప్తు కోసం అక్కడున్న ఆవ నూనె నమూనాలను అధికారులు సేకరించారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి.. కల్తీ ఆవ నూనెను విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందడం వల్ల సోదాలు చేసినట్లు అల్వర్ సబ్ డివిజన్ అధికారి యోగేష్ ఠాగూర్ తెలిపారు.
ఇదీ చూడండి:యూపీ కల్తీ మద్యం.. 15కి చేరిన మృతుల సంఖ్య
Last Updated : May 29, 2021, 9:04 AM IST