Mustache Police Suspension: మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. జుట్టు, మీసాలు కత్తిరించమని పై అధికారులు ఆదేశించినప్పటికీ వినలేదని.. విధుల నుంచి తప్పించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.
సస్పెండ్ అయిన రాకేశ్ రాణా.. డిపార్ట్మెంట్లో మోటార్ వెహికల్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. రాణాను సస్పెన్షన్ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం దర్శనం ఇచ్చాయి. పోలీసు శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పని చేస్తున్న.. ప్రశాంత్ శర్మ ఈ ఉత్తర్వులను ఇచ్చినట్లు రాణా తెలిపారు. జుట్టు, మీసాలు కత్తిరించకపోవడం వల్లనే విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రానా మెడ వరకు మీసాలు, జుత్తుతో విధులు హాజరయ్యారని, వాటిని కత్తిరించమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్ శర్మ తెలిపారు. యూనిఫాం వేసుకున్న ఏ వ్యక్తి కూడా అటువంటి వేషధారణతో విధులకు హాజరుకారని స్పష్టం చేశారు.