దేశంలోని హిందువులు, ముస్లిముల మూలాలన్నీ ఒక్కటే అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్(Mohan Bhagwat RSS) పేర్కొన్నారు. ప్రతి భారతీయుడూ హిందువే అని వ్యాఖ్యానించారు. తెలివైన ముస్లిం నాయకులు మతోన్మాదులకు వ్యతిరేకంగా నిలవాలన్నారు. హిందువులు ఎవరి పట్ల శత్రుత్వం చూపరని, దేశంలోని మైనార్టీలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
గ్లోబల్ స్ట్రాటజిక్ పాలసీ ఫౌండేషన్ సంస్థ ముంబయిలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్(Mohan Bhagwat) ఈ వ్యాఖ్యలు చేశారు.
జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై దుమారం...
హిందుత్వ సంస్థలను తాలిబన్‌తో పోలుస్తూ బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్(Javed Akhtar) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. తాలిబన్లు ఇస్లాం దేశాన్ని కోరుకుంటున్నారు. వీరు హిందూ దేశాన్ని కోరుకుంటున్నారు. అంటూ ఏ సంస్థ పేరునూ ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిందూ దేశ అనుకూలవాదులను తాలిబన్ల మనస్తత్వం ఉన్నవారిగా పేర్కొనడం ఏంటని శివసేన ప్రశ్నించింది. సమాజాన్ని గందరగోళపరిచే కుట్రలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది. మరోవైపు జావేద్ క్షమాపణలు చెప్పేవరకూ తన సినిమాలను దేశంలో ఆడనివ్వమని భాజపా ఎమ్మెల్యే రామ్ కదమ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి:Supreme Court: 'పంజరంలో చిలకలాగే సీబీఐ.. దానికి స్వేచ్ఛ ఉండాలి'