ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన పేరు మార్చుకుని అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు. అసలు విషయం తెలిసిన తర్వాత బాధితురాలు అతడిని దూరం పెట్టడం వల్ల ఆమె ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
పేరు మార్చుకుని ప్రేమ అంటూ మోసం.. పెళ్లి చేసుకోవాలని వీడియోలతో బ్లాక్మెయిల్.. చివరకు..
ఓ యువకుడు తన పేరు మార్చుకుని ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. నిజాన్ని తెలుసుకున్న బాధితురాలు అతడిని దూరం పెట్టగా.. ఆమె ప్రైవేట్ వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్ ఆల్మోరా జిల్లాకు చెందిన బాధితురాలు నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. అదే ప్రాంతంలోని మరో కంపెనీలో పనిచేస్తున్న హసీన్ షఫీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కానీ తన పేరు ఆశిష్ ఠాకుర్గా ఆమెకు చెప్పాడు. కొద్దిరోజులకే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో అదే ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని వీరిద్దరూ ఉంటున్నారు.
ఓ రోజు షఫీ తండ్రి అదే ప్రాంతానికి వచ్చాడు. అక్కడి స్థానికులతో మాట్లాడాడు. అప్పుడు వారందరికీ ఆశిష్.. షఫీ అని తెలిసింది. ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పారు. ఆ తర్వాత బాధితురాలు షఫీని దూరం పెట్టింది. ఇక అప్పటి నుంచి షఫీ.. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే తన దగ్గర ఉన్న ప్రైవేట్ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.