తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా తరఫున ప్రచారం.. ముస్లిం యువకుడ్ని కొట్టి చంపిన స్థానికులు - యూపీ వార్తలు

UP Muslim Youth Dead: భాజపా తరఫున ప్రచారం చేసిన ఓ ముస్లిం యువకుడిని స్థానికులు కొట్టి చంపారు. ఉత్తర్​ప్రదేశ్​లోని కుషీనగర్​లో ఈ ఘటన జరిగింది.

muslim-youth-beaten-to-death
ముస్లిం యువకుడి

By

Published : Mar 28, 2022, 11:59 AM IST

Muslim youth beaten to death: ఉత్తర్​ప్రదేశ్ కుషీనగర్​లో దారుణం జరిగింది. రామ్​కోలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కథ్ఘార్హీ గ్రామంలో ఓ ముస్లిం యువకుడిని కొందరు కొట్టి చంపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇతడు భాజపా తరఫున ప్రచారం చేయడమే గాక.. యోగి ప్రభుత్వం మరోసారి గెలిచిన ఆనందంలో స్వీట్లు పంచాడు. ఇది చూసి సహించలేని ఇరుగు పొరుగు వారు యువకుడిని మార్చి 20న చుట్టుముట్టి చితకబాదారు. తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబసభ్యులు రామ్​కోలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడం వల్ల లఖ్​నవూలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడకు వెళ్లాక చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు.

Kushinagar News: ఈ ఘటనలో మరణించిన మృతుడి పేరు బాబర్​. భాజపా తరఫున చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది నచ్చని కొందరు స్థానికులు అతడిని పార్టీకి దూరంగా ఉండాలని హెచ్చరించారు. నాలుగు నెలల క్రితమే చంపుతామని బెదిరించారు. ఈ విషయంపై బాబర్ రామ్​కోలా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అతని సోదరుడు అలాం చెప్పారు. కలెక్టర్​ను కూడా కలిసిననట్లు పేర్కొన్నారు. స్థానిక భాజపా ఎమ్మెల్యే పీఎన్ పాఠక్​ కోసం తన సోదరుడు ప్రచారం చేశాడని వివరించారు. బాబర్ మరణ వార్త తెలిసిన అనంతరం పాఠక్​ అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:లవర్​తో కలిసి మాజీ ప్రియుడ్ని హత్య చేసిన మైనర్

ABOUT THE AUTHOR

...view details