ఉత్తర్ప్రదేశ్ వారణాసిలో (Varanasi news today) ముస్లిం మహిళ రామ మందిరంలో పూజలు (Prayers to Lord Rama) నిర్వహించారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాముడికి మహా హారతి ఇచ్చారు. గత 15 ఏళ్లుగా ప్రతి దీపావళికి శ్రీరాముడికి హారతి ఇస్తున్నారు నంజీన్ అన్సారీ. తమ చేతులతో స్వయంగా హారతి ఇస్తున్నారు.
స్వయంగా పాటలు పాడుతూ మహా హారతి ఇస్తున్నారు అన్సారీ. ఆమెతో పాటు మరికొందరు ముస్లిం మహిళలు సైతం ఈసారి పూజకు హాజరయ్యారు. వేదపండితులు అన్సారీతో కలిసి పూజలు చేశారు.