హిందూ-ముస్లిం భాయీభాయీ (Hindu Muslim unity in India) అనేది దేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ-ముస్లిం మధ్య సఖ్యతను (Hindu Muslim unity) చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. ఓ ముస్లిం మహిళ.. హిందూ గుడిలో పూజలు చేశారు. మత సామరస్యానికి అద్దం పట్టే ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది. (Karnataka Shivamogga news)
దసరా సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేయడం హిందువుల ఆనవాయితీ. ప్రతి దుర్గా దేవి గుడిలో ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి. ఇదే విధంగా శివమొగ్గలోని సాగర్ ప్రాంతంలోనూ విశిష్ట పూజలు జరిపించారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ సైతం పూజా కార్యక్రమాలకు హాజరయ్యారు. అమ్మవారి మందిరం గర్భగుడిలోకి వచ్చి పూజలో పాల్గొన్నారు ఫమీదా అనే మహిళ. తమ సంప్రదాయంగా ధరించే బుర్ఖాతోనే గుడికి వచ్చారు.