దేవుడి పట్ల నమ్మకం ఉన్నవారు ఏ మత పవిత్ర ప్రాంతాలనైనా సందర్శించవచ్చు. ఓ మత ఆచారాలనైనా పాటించవచ్చు. హిందువులు.. మసీదుకు వెళ్లవచ్చు. ముస్లింలు దేవాలయానికి రావచ్చు. క్రైస్తవులు.. గుడి, మసీదుకు వెళ్లొచ్చు. కర్ణాటకలోని విజయపురలో ఇలానే మతసామరస్యం వెల్లివిరిసింది.
వెల్లివిరిసిన మతసామరస్యం.. హనుమాన్ మాలలో ముస్లిం వ్యక్తి.. భక్తిశ్రద్ధలతో భజనలు - భక్తిశ్రద్ధలతో హనుమాల్ మాల ధరించిన ముస్లిం వ్యక్తి
ఓ ముస్లిం వ్యక్తి హనుమాన్ మాల ధరించిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. భక్తిశ్రద్ధలతో ఆయన పూజలు చేస్తున్నారు.
హనుమాన్ మాల ధరించిన జాఫర్
నలసలగి గ్రామానికి చెందిన జాఫర్ అనే ముస్లిం వ్యక్తి హనుమాన్ మాల ధరించారు. భక్తిశ్రద్ధలతో దీక్షను ఆచరించి.. హనుమాన్ జన్మస్థలంగా చెప్పే అంజనాద్రి కొండకు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటానని చెబుతున్నారు. నుదిటిపై గంధం, కుంకుమ పెట్టి.. ఆంజనేయ స్వామి పూజలు చేస్తున్నారు. శ్రద్ధా నియమాలతో దీక్షను పూర్తి చేస్తానని జాఫర్ తెలిపారు. కులం కంటే మత సామరస్యం గొప్పదని అంటున్నారు.