తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో లవ్ జిహాద్​ కేసు.. మతం మారాలంటూ మహిళపై వేధింపులు

బిహార్​ కతిహార్ జిల్లా​లో మరో లవ్​ జిహాద్​ ఘటన జరిగింది. ఓ ముస్లిం యువకుడు హిందు మహిళను మోసం చేసి పెళ్లి చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మతం మారాల్సిందిగా ఒత్తిడి చేస్తూ దాడికి తెగబడుతున్నాడు.

muslim man assulted hindu wife
మతం మారాలంటూ దాడి హిందు భార్యపై దాడి

By

Published : Nov 19, 2022, 8:36 PM IST

లవ్​ జిహాద్​పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.

పోలీసుల కథనం ప్రకారం.. బిహార్​ కతిహార్ జిల్లా​కు చెందిన తాకీర్​ ఆలాం దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నాడు. అర్చన అనే యువతికి 2015లో ఫేస్​బుక్​కు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో తాను ఓ హిందువునని.. తన పేరు రాజ్​ రాజ్​పుత్​గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. ​దుబాయ్​ నుంచి వచ్చిన తాకీర్.. అర్చనను తన కుటుంబ సభ్యుల మధ్య హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.

మతం మారాలంటూ దాడి హిందు భార్యపై దాడి

కొద్ది రోజుల తర్వాత అర్చనను తన ఇంటికి తీసుకెళ్లాడు తాకీర్​. అప్పుడే అతడొక ముస్లిం అని.. అంతకముందే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అర్చనకు తెలిసింది. అప్పటినుంచి తాకీర్,​ అతడి కుటుంబ సభ్యులు అర్చనను తీవ్రంగా కొడుతూ, మతం మారమని ఇబ్బందులకు గురి చేశారు. "నేను ఒక హిందువు. నన్ను మోసం చేసి తాకీర్​ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత తన సోదరి ఇంట్లో ఉంచాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు మతం మారమని నన్ను తీవ్రంగా హింసిచాడు." అని అర్చన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details