Muslim family Durga Puja in Assam :అసోంలోని శివసాగర్ జిల్లాలోని దేవి డౌల్ ఆలయం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి ఏటా మహా అష్టమి రోజున.. ఓ ముస్లిం కుటుంబం దుర్గామాతకి పూజలు నిర్వహిస్తోంది. అనంతరం దుర్గా మాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. దాదాపు 290 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా దుర్గా మాతకు మహా అష్టమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించింది ముస్లిం దౌల్లా ఫ్యామిలీ. ఆదివారం సాయంత్రం ఈ పూజ జరిగింది. అనంతరం ఆలయ పూజారి.. దుర్గామాత ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా ముస్లిం దౌల్లా ఫ్యామిలీకి అందించారు. దాంతోపాటు కాన్సెంగ్ బోర్పాత్ర గోహైన్ కుంటుబానికి ఈ ప్రసాదాన్ని అందజేశారు ఆలయ పూజారి.
అహోం రాజుల పరిపాలన నుంచే దౌల్లా ముస్లిం కుటుంబానికి దుర్గా పూజా ప్రసాదం అందించడం అనేది అనవాయితీగా వస్తోంది. అప్పటి స్వర్గదేవు శివ సింహ అనే రాజు కలంచుపారియా గ్రామంలో ఓ చెరువును తవ్వించారు. దాంతోపాటు ఈ దుర్గా మాత ఆలయాన్ని కూడా కట్టించారు. అప్పటి నుంచి దుర్గాదేవి ఆలయంలో పూజ జరిగే సమయంలో నగారా, ధాక్ మోగిస్తున్నారు దౌల్లా కుటుంబ పూర్వికులు. క్రమంగా వీరు నగారా, ధాక్ వాయించడం ఆపేసినప్పటికీ.. దుర్గా ప్రసాదం ఇచ్చే సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది.