రాజస్థాన్లోని జైపుర్ మతసామరస్యానికి వేదికైంది. హిందూ మతానికి చెందిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ముస్లింలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను చేశారు. 'రామ్ నామ్ సత్య హై' అంటూ నినాదాలు చేస్తూ రెండు కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు తీసుకెళ్లారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పర్వదినం రోజునే ఈ ఘటన జరగింది.
హిందువుకు ముస్లింల అంత్యక్రియలు.. బక్రీద్ రోజు వెల్లివిరిసిన మతసామరస్యం - జైపుర్ న్యూస్
బక్రీద్ పర్వదినాన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన జరిగింది. హిందూ మతానికి చెందిన వ్యక్తి మరణించగా.. ముస్లింలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపుర్లో జరిగింది.
జైపుర్ సంజయ్ నగర్ బస్తీకి చెందిన సెన్సార్పాల్ సింగ్ తన్వార్ శనివారం మరణించాడు. అంతిమసంస్కారాలు నిర్వహించడానికి సరిపోయేంత జనం లేకపోవడం వల్ల వాయిదా వేశారు. ఈ క్రమంలోనే ఆదివారం బక్రీద్ సందర్భంగా బస్తీ సమీపంలోని నూరానీ మసీదు వద్దకు ముస్లింలు ప్రార్థనల కోసం చేరుకున్నారు. పాల్సింగ్ మరణ విషయం తెలుసుకున్న వీరు.. అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని స్మశాన వాటికకు కాలినడకన తీసుకెళ్లి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇవీ చదవండి: