తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు మ్యూజిక్​ థెరపీ! - కరోనా రోగుల కోసం గుజరాత్​లో వినూత్న చికిత్స

కరోనా బాధితులు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు వినూత్న చర్యలు చేపడుతోంది గుజరాత్​లోని ఓ ప్రముఖ వైద్యశాల. వడోదరలోని పారూల్​ ఆస్పత్రిలో.. 'మ్యూజిక్​ థెరపీ' పేరిట అక్కడి సిబ్బంది కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. ఇదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? అయితే.. ఈ కథనం చదివేయండి.

Music therapy for the Corona patients
కరోనా రోగుల కోసం మ్యూజిక్​ థెరపీ

By

Published : Apr 17, 2021, 7:27 PM IST

Updated : Apr 17, 2021, 8:02 PM IST

పారూల్​ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు మ్యూజిక్​ థెరపీ!

గుజరాత్​లో కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్​ సోకినవారిలో రోజుకు సగటున 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది వడోదరలోని పారూల్​ ఆస్పత్రి. అక్కడి రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు 'మ్యూజిక్​ థెరపీ(సంగీత చికిత్స)' పద్ధతిని పాటిస్తోంది. వారిలో ఎలాంటి భయాందోళనలు దరి చేరనీయకుండా ఆటపాటలు, చప్పట్లతో.. ఆత్వవిశ్వాసాన్ని నింపుతోంది.

స్టెప్పులు.. చప్పట్లు..

కొవిడ్​ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో.. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేస్తూ వారిని అలరిస్తున్నారు. ఓ వైపు వారు స్టెప్పులేస్తుంటే.. మరోవైపు వృద్ధులతో సహా.. ఇతర రోగులంతా వారితో పాటు సరదాగా చప్పట్లు కొడుతూ ఆనందంగా గడిపారు. పారూల్​ ఆస్పత్రి అవలంబిస్తున్న ఈ మ్యూజిక్​ థెరపీ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కరోనా రోగుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం చక్కటి సేవలందిస్తోందని కితాబిచ్చారు.

ఇదీ చదవండి:రైల్వేస్టేషన్లలో మాస్క్‌ లేదంటే రూ.500 ఫైన్‌

Last Updated : Apr 17, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details