Murder in korba: ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో హృదయవిదారక సంఘటన వెలుగు చూసింది. నాలుగేళ్ల పిల్లాడి తలపై ఇటుకతో కొట్టి హత్య చేశాడు ఓ 11 ఏళ్ల బాలుడు. అనంతరం ఇంటికెళ్లి రక్తపు మరకలతో ఉన్న బట్టలను శుభ్రం చేసుకుని ఏమీ ఎరగనట్లు వ్యవహరించాడు. అయితే.. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఈ కేసును గంటల్లోనే ఛేదించాయి.
ఇదీ జరిగింది:జిల్లాలోని మానిక్పుర్ చౌక్ ప్రాంతంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న ఓ నాలుగేళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మృతుడ్ని ముఢాపార్కు చెందిన అన్షు సారథిగా గుర్తించారు. చిన్నారి మృతదేహం లభ్యమైన క్రమంలో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి ఆధారాలు సేకరించారు. స్నిఫ్ఫర్ డాగ్ 'బాఘా' మృతుడి బట్టలను వాసన చూసి నేరుగా ఓ ఇంట్లోకి పరుగెట్టింది. ఇంట్లో కనిపించిన 11 ఏళ్ల బాలుడిని చూసి అరవటం ప్రారంభించింది. వెంటనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.