Murder in Jharkhand: ఝార్ఖండ్‌లోని పాకుడ్ జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను అత్యంత క్రూరంగా హత్య చేసి.. చేరో కన్నును తొలగించారు దుండగులు. ఈ దారుణ హత్య అమడాపాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాడీహా గ్రామంలో గురువారం రాత్రి జరిగినట్లు జిల్లా ఎస్పీ హ్రుదీప్ పీ జనార్ధన్ తెలిపారు.
" గ్రామం సమీపంలోని పంట పొలాల్లో ఓ బాలుడు, బాలిక మృతదేహాలు లభించాయి. వారి చెరో కన్నును తొలగించారు. బాలికకు 12, బాలుడికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. వ్యక్తిగత కక్షలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాం. బాధితుల బంధువు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. "
- హ్రుదీప్ పీ జనార్ధన్, జిల్లా ఎస్పీ.