తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కార్లలో తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే.. - panchkula swachh bharat

కారులో ప్రయాణిస్తుండగా కిటికీలోంచి చెత్తను రోడ్డు మీదే పారేస్తుంటారు చాలా మంది. ఈ ధోరణిని కట్టడి చేసేందుకు హరియాణాలోని ఓ పురపాలక సంస్థ కృషి చేస్తోంది. కార్లలో డస్ట్​బిన్స్​ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతోంది.

mini dustbins for cars haryana, panchkula car dustbins
కార్లలో కూడా డస్ట్​బిన్స్​ ఏర్పాటు!

By

Published : Jun 17, 2021, 5:21 PM IST

Updated : Jun 17, 2021, 10:40 PM IST

స్వచ్ఛ భారత్​ పేరిట ప్రభుత్వాలు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలలో చాలా మంది నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొందరు వాహనదారులు.. రోడ్లపైన చెత్తను పడేస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారు. దీనిని కట్టడి చేసేందుకు హరియాణాలోని పంచకుల పురపాలక సంస్థ కృషి చేస్తోంది. నగర వాసులు అందరూ తమ కార్లలో డస్ట్​బిన్స్​ ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం కార్పరేషనే స్వయంగా వాటిని పంపిణీ చేస్తోంది.

'పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా.. బయోడీగ్రేడబుల్​ బ్యాగులను, కార్లకు డస్ట్​బిన్స్​ను పంపిణీ చేస్తున్నాము' అని పంచకుల మేయర్​ కులభూషన్​ గోయల్​ తెలిపారు.

ఇదీ చూడండి :బావిలో పడిన ఏనుగు.. ఇలా బయటకు...

Last Updated : Jun 17, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details