Mundra Port Drugs Case: గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఓ అఫ్గాన్ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు డ్రగ్స్ సరఫరాలో అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆర్యాన్ఫర్ కీలక పాత్ర వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు ఆర్యాన్ఫర్.. దిల్లీలోని నెబ్సరాయ్ ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలిపారు.
ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసులో అఫ్గాన్ వ్యక్తి అరెస్ట్ - గుజరాత్ డ్రగ్స్ కేసు తాజా
Mundra Port Drugs Case: ముంద్రాపోర్ట్ డ్రగ్స్ కేసులో ఎన్ఐఏ మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ.
ముంద్రా పోర్ట్
ఈ ఏడాది సెప్టెంబరులో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో 2,988.21 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసింది.
ఇదీ చూడండి :దేశంలో ఒమిక్రాన్ 'పీక్' ఎప్పుడు? భారత్ సిద్ధమేనా?