Mundra port drug seizure: గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో మరోసారి భారీ ఎత్తున మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి! 25,000 కేజీల బరువున్న వెయ్యి పాపీ సీడ్స్(గసగసాల) ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.5 కోట్లు అని తెలిపారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఇచ్చిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు వీటిని గుర్తించారు. ముంద్రా పోర్టులోని సీబర్డ్ సీఎఫ్ఎస్ కంటైనర్‌లో అమ్మోనియం సల్ఫేట్ బస్తాల కింద వీటిని దాచినట్లు తెలిపారు.
Poppy seeds drugs seizure
గసగసాల గింజలను మత్తు పదార్థంగా వర్గీకరిస్తారు. వివిధ ప్రపంచ దేశాల్లో దీనిపై నిషేధం ఉంది. భారత్‌లోనూ దీన్ని మత్తు పదార్థంగానే భావిస్తారు. అందువల్ల, దీనిని ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా నార్కోటిక్స్ కమిషనర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
దిల్లీ కంటైనర్ డిపోలో రిజిస్టర్ అయిన ఓ వ్యాపారి పేరు మీద ఈ బస్తాలు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. స్మగ్లింగ్ కోసమే వీటిని రవాణా చేసినట్లు భావిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇక్కడ మత్తుపదార్థాలు పట్టుబడటం ఇది రెండోసారి. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారు.
బ్రౌన్ షుగర్ అక్రమ రవాణా