గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో లభ్యమైన 2,998 కిలోల డ్రగ్స్ కేసులో (mundra drug case) జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్ఐఏ) దిల్లీ, ఎన్సీఆర్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే అక్టోబర్ 9న తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ.. తాజాగా మరోసారి దాడులు నిర్వహించింది. (Mundra port drugs case)
ఇదివరకు చెన్నై, కోయంబత్తూర్, విజయవాడ నగరాల్లో దాడులు చేసింది ఎన్ఐఏ. (NIA raids) నిందితులు, అనుమానితులకు సంబంధించిన ప్రదేశాలలో తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, సామగ్రిని ఎన్‌ఐఏ అధికారులు సీజ్ చేశారు. మూడు రోజుల క్రితం జరిపిన దాడులకు అనుగుణంగానే తాజా దాడులు కొనసాగుతున్నాయని ఎన్‌ఐఎ వెల్లడించింది.
ఏమిటీ కేసు?
గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో (Gujarat Mundra Port News) ఇటీవలే 2,988 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నార్కోటిక్స్ కేసు విచారణ కొద్దిరోజుల క్రితం ఎన్‌ఐఏకు బదిలీ అయింది. (Mundra Port Drugs Case) నార్కోటిక్స్ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు (NIA Latest News) అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో ఇప్పటివరకు 9 మంది అరెస్టు అయ్యారు. ఇందులో నలుగురు అఫ్గాన్ పౌరులు కాగా, ఒకరు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నిందితుడు ఉన్నాడు. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తో కలిపితే.. మొత్తం సీజ్ చేసిన హెరాయిన్ 3,004 కేజీలు దాటింది.
ఇదీ చదవండి: