స్వాతంత్య్రోద్యమకాలంలో(Independence Movement) బ్రిటిషర్ల అభిప్రాయం ప్రకారం భారతీయ అవలక్షణాల్లో వరకట్నం ఒకటి! కానీ.. ఆ జాడ్యం వారికీ ఉండేది. కట్నం(Dowry) కింద ఏకంగా మన ముంబయి నగరాన్నే(Mumbai history) తీసుకున్న చరిత్ర వారిది!
కట్నంగా ముంబయి నగరం.. ఏడాదికి 10 పౌండ్ల లీజు! - కట్నంగా మహానగరం
వరకట్నం(Dowry) కింద డబ్బులు, నగలు, స్థిర, చరాస్తులను ఇస్తారు. కానీ, కట్నం కింద ఏకంగా ఓ మహానగరాన్నే ఇవ్వటం తెలుసా? అవును భారత్‌ను పాలించిన బ్రిటిషర్లు(British) కట్నం కింద ముంబయి నగరాన్నే(Mumbai history) తీసుకున్నారు. చరిత్రను ఓసారి పరిశీలిస్తే..
1534లో.. నానాటికీ విస్తరిస్తున్న మొఘల్ సామ్రాజ్యాన్ని చూసి ఆందోళన చెందిన గుజరాత్ రాజు సుల్తాన్ బహదూర్‌షా.. పోర్చుగీసువారితో(Portuguese) ఒప్పందం కుదుర్చుకున్నాడు. బస్సేన్ ఒప్పందంగా పిలిచే దీని ప్రకారం.. ఏడు ద్వీపాల ముంబయి, దాని పక్కనే ఉన్న బస్సేన్ (ఇప్పుడు వాసాయ్)లను పోర్చుగీసుకు అప్పగించాడు. వారు ముంబయిలో వాణిజ్య కేంద్రాన్ని స్థాపించారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ త్వరలోనే భౌగోళికంగా, ఆర్థికంగా ముంబయి ప్రాధాన్యాన్ని గుర్తించింది. దానిపై కన్నేసింది. పోర్చుగీసుతో పోరు కూడా మొదలైంది. కానీ... ఇంతలో పోర్చుగీసు రాజు కింగ్ జాన్-4 తన కుమార్తె కాథెరీనా బ్రగాంజాను ఇంగ్లాండ్‌కు చెందిన చార్లెస్-2కిచ్చి పెళ్లి చేశారు. పోర్చుగీసు రాజు.. ముంబయిని కట్నం కింద ఇంగ్లాండ్‌కు ఇచ్చేశాడు. గమ్మత్తేమంటే... అప్పటికి భారత్ ఇంకా బ్రిటన్ ప్రభుత్వ అధికారంలోకి రాలేదు. వారి వాణిజ్య సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ(East India company established) పెత్తనం సాగుతోంది. దీంతో.. తమకు కట్నం కింద వచ్చిన ముంబయి నగరాన్ని బ్రిటిష్ రాజకుటుంబం ఏడాదికి 10 పౌండ్ల చొప్పున ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకు ఇచ్చేసింది!
ఇదీ చూడండి:భరతమాత విముక్తికి ఆత్మార్పణ చేసిన వీరనారి అవంతిబాయి