తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్! - ముంబయి ఒమిక్రాన్ కేసుల సంఖ్య

కరోనా టీకా మూడు డోసులు తీసుకున్నప్పటికీ.. ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్​గా తేలింది. అమెరికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్​ కేసు బయటపడింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Omicron
ఒమిక్రాన్

By

Published : Dec 18, 2021, 9:15 AM IST

కొవిడ్ టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి కరోనా కొత్త వేరియంట్ సోకడం కలకలం సృష్టిస్తోంది. అమెరికా నుంచి ముంబయి వచ్చిన 29 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్ బయటపడినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. అతనిలో ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించింది.

"నవంబర్ 9న న్యూయర్క్ నుంచి వచ్చిన వ్యక్తికి విమానాశ్రయంలో కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. అనంతరం అతని నమూనాలను ఇతర పరీక్షల కోసం పంపగా ఒమిక్రాన్ సోకినట్టు తేలింది."

---బీఎంసీ

అతనితో పాటు ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్​గా తేలింది. ఇక ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ.. రోగుల్లో తీవ్రమైన లక్షణాలేవీ లేవని.. కంగారు పడాల్సిన అవసరం లేదని బీఎంసీ పేర్కొంది.

మరోవైపు.. తాజా పాజిటివ్ కేసుతో.. ముంబయిలో ఒమిక్రాన్ రోగుల సంఖ్య 15కి చేరింది. వీరిలో 13మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details