కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయి నగరం బోసిపోయి కనిపిస్తోంది. అనేక వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ ప్రాంతాలు.. జనసంచారం లేకుండా మారాయి.
శుక్రవారం సాయంత్రం 8 గంటలకు మొదలైన ఈ లాక్డౌన్.. సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న ముంబయిలోని 'గేట్ వే ఆఫ్ ఇండియా' పరిసరాలు వారాంతపు లాక్డౌన్ కారణంగా తాజ్ హోటల్ వద్ద జనసంచారం లేని దృశ్యం లాక్డౌన్ ప్రభావంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ సమీపంలోని వీధులు, బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయం సమీపంలోని ప్రాంతాలు కళ తప్పాయి.
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలో నిర్మానుష్యంగా పరిసరాలు బీఎంసీ వద్ద జనసంచారం లేని దృశ్యం నిర్మానుష్యంగా ముంబయి నగర వీధులు వారాంతపు లాక్డౌన్ కారణంగా ముంబయిలోని మెరెన్ డ్రైవ్ వెంబడి దారులన్నీ వెలవెలబోయాయి. మళ్లీ గతేడాది లాక్డౌన్ నాటి దృశ్యాలను గుర్తుకు తెస్తున్నాయి. అధికారులు ఈ ప్రాంతంలో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నిత్యావసరాలను సరఫరా చేసే వాహనాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతినిస్తున్నారు.
బోసిపోయిన మెరెన్ డ్రైవ్ ప్రాంతం కళ తప్పిన మెరెన్ డ్రైవ్ రహదారులు మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు శుక్రవారం ముంబయిలో 9,200 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొవిడ్ ధాటికి మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!