మహారాష్ట్రలో సవతి కుమారైపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి.. ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఈ దారుణం 2019లో జరగగా.. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కానీ తన తండ్రిని క్షమించాలని.. జైలులో పెట్టొదని బాధితురాలే కోర్టును కోరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీఎన్ఏ నివేదిక ఆధారంగా నిందితుడికి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే..
ముంబయిలో ఓ తండ్రి(41) తన మైనర్ సవతి కుమారైపై 2019 అక్టోబర్ నుంచి 2020 జూన్ వరకు లైంగికంగా వేధించాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాధితురాలు తన తల్లి సహాయంతో.. ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.