తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లక్కీ ఫ్యామిలీ.. 24ఏళ్ల క్రితం చోరీకి గురైన బంగారం ఇప్పుడు వాపస్! - ముంబయి బంగారం దొంగతనం

Mumbai Robbery: 24 ఏళ్ల క్రితం దొంగతనానికి గురైన కోట్లు విలువైన బంగారు ఆభరణాలను హక్కుదారులకు తిరిగి అప్పజెప్పారు పోలీసులు. ఈ ఘటన ముంబయిలోని కొలాబా ప్రాంతంలో జరిగింది.

mumbai robbery
బంగారం

By

Published : Jan 31, 2022, 5:03 PM IST

Mumbai Robbery: మహారాష్ట్ర ముంబయిలోని కొలాబా ప్రాంతంలో 24 ఏళ్ల తర్వాత న్యాయం దక్కింది ఓ కుటుంబానికి. అప్పుడు కోల్పోయిన కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు తిరిగి వారి సొంతమయ్యాయి.

కోట్ల విలువైన బంగారం

అర్జన్ దాస్వానీ కుటుంబం నుంచి 1998లో రెండు పురాతన బంగారు నాణేలు, 3 బంగారు కంకణాలు, రెండు కడ్డీలను దొంగలించారు దుండగులు. అప్పుడే అర్జన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందంటూ అనేక ఏళ్లు ఠాణా చుట్టూ తిరిగింది. చివరకు చోరీకి గురైన సొత్తును నిందితుల నుంచి స్వాధీనం చేసుకుని ఆ కుటుంబానికి అందించామని ఏసీపీ పాండురంగ శిందే తెలిపారు.

బంగారాన్ని అర్జన్ దాస్వానీ కుటుంబానికి అప్పగిస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details