మహారాష్ట్రలోని చెంబూరు, విఖ్రోలిలో గోడలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 31కి చేరింది. చెంబూరులో జరిగిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 21కి చేరగా.. విఖ్రోలిలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ముంబయిలో రానున్న 24 గంటలను ప్రభుత్వం రెడ్ అలెర్ట్‌గా ప్రకటించింది.
అర్ధరాత్రి తర్వాత..
ఈ ఘటనలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే వరదలకు కొట్టుకుపోయిన మూడు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రజలను పరామర్శించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
17వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడటంతో గోడలు కూలాయని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం పేర్కొంది. ఇప్పటికే బృందంలోని సిబ్బంది గోడ కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు. చెంబూరులో ఒంటిగంట సమయంలో, విఖ్రోలిలో అర్ధరాత్రి 2.30 సమయంలో గోడలు కూలాయి.
కూలిన గోడలు విరిగిపడ్డ కొండచరియలు ముంబయి నగరాన్ని భారీ వరదలు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బోరివాలిలో పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. చాలాచోట్ల పట్టాలపై నీరు నిలవడంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వే సంస్థలు సర్వీసులను నిలిపివేశాయి.
ఇదీ చదవండి:లోయలో పడిన వాహనం- 8 మంది కూలీలు మృతి
కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి