Port Jobs In Mumbai : జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు సర్టిఫికేట్ ఉందా? అయితే ముంబయి పోర్ట్ అథారిటీ స్పోర్ట్స్ క్లబ్ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ, కబడ్డీ, వాలీబాల్ క్రీడల్లో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పొందిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇన్ని ఖాళీలు:
పోస్టులు:
Mumbai Port Authority Posts 2023 : స్పోర్ట్స్ ట్రెయినీ
విభాగాలు:
అథ్లెటిక్స్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్.
ఈ విభాగానికి ఇన్ని..
- అథ్లెటిక్స్- 5- పురుషలు (3), మహిళలు (2)
- షటిల్ బ్యాడ్మింటన్- 3 (పురుషులు)
- క్రికెట్- 9 (పురుషులు)
- ఫుట్‌బాల్- 11 (పురుషులు)
- హాకీ- 10 (పురుషులు)
- కబడ్డీ-9 (పురుషులు)
- వాలీబాల్-7 (పురుషులు)
అర్హత:
Mumbai Port Authority Posts Eligibility : అభ్యర్థులు అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ.14,000/- చెల్లిస్తారు.
ఏజ్ లిమిట్:
Mumbai Port Authority Posts Age Limit : ఆసక్తి గల అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. 01.07.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
వయోపరిమితి:
అభ్యర్థులకు ఎలాంటి వయోపరిమితి సడలింపులు ఉండవు.
దరఖాస్తు చివరి తేది:
Mumbai Port Authority Jobs Last Date : 2023, జులై 26 సాయంత్రం 5:30 నిమిషాల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. www.mumbaiport.gov.in వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే దరఖాస్తు రుముము కింద రూ.200 బ్యాంకులో చెల్లించి రశీదు తీసుకోవాలి. అనంతరం వివరాలు నింపిన అప్లికేషన్ ఫారమ్‌ను బ్యాంకు రశీదుతో జత చేసి కింద తెలిపిన అడ్రస్‌కు ఈ నెల 26 తేదీలోపు పోస్ట్‌లో పంపాలి.
చిరునామా:
Mumbai Port Authority Address : JT. GENERAL SECRETARY Mumbai Port Authority Sports Club, 2nd Floor, Railway Manager’s building, Ramjibhai Kamani Marg, Near Vasant Hotel, Ballard Estate, Mumbai-400 001. ఈ అడ్రస్‌కు అప్లికేషన్‌ను పంపాలి.
ఇంతకాలం పనిచేయాలి:
సంస్థ నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పది నెలలు పనిచేయాలి.