ముంబయిలోని ధూలే ప్రాంతానికి చెందిన ధ్యానీష్ పాటిల్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఐర్లాండ్‌లోని ఫేస్బుక్ ప్రతినిధులు ఈ మేరకు ముంబయి పోలీసులకు సమాచారం అందించారు.
అలా కాపాడారు..

ధ్యానీష్ పాటిల్ ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్టు ఆదివారం రాత్రి సుమారు 8.10 గంటలకు ముంబయి పోలీసులకు సమాచారం అందింది. ఐర్లాండ్ నుంచి ఫేస్బుక్ ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు వారు హుటాహుటిన ధూలేకు చేరుకున్నారు.
ఫేస్‌బుక్‌లోని పాటిల్ ఖాతాలో ఉన్న ఫోన్ నెంబర్ల ఆధారంగా అతని నివాసాన్ని గుర్తించారు. పోలీసులు చేరుకునే సమయానికి పాటిల్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇటువంటి ఘటనే గతేడాది ఆగస్టులోనూ జరిగింది.
ఇదీ చదవండి :పొరపాటున దేశం దాటి.. 11 ఏళ్లకు ఇల్లు చేరి...